అరె
బల్లి అటు తిరిగింది
ప్రపంచమెంత చలనశీలం
కోటలు చుట్టేస్తాం
పేటలు దాటేస్తాం
పేరు మర్చిపేయి అందర్నీ అడుక్కుంటూ ఉంటాం
గమ్యాన్ని పలవరిస్తూ దారి మర్చిపోయిన బాటసారులం కదా
ఎవరికైనా ఎలా తెలుస్తుందసలు
తెలిసిందంతా తెలీనిదని తెలీకే కదా
నేలా బండా ఆడుతూనే ఉంటాం
అక్షరాలు అబద్ధాలని తెలీకనే కదా
నిర్వచనాల నడుములిరగ్గొట్టడం తెలీకనే కదా
పదాల ఉప్పు మూటల్ని తిరగేస్తూనే ఉంటాం
విశేషణమే విశేషమనుకున్నాం కదా!
దీర్ఘకావ్యం రాస్తూ వ్యాకరణాన్ని మర్చిపోయిన రచయితలం కదా1
నామవాచకం సర్వనామమయ్యే మర్మకళ ఏదో
ఎవరికైనా ఎలా తెలుస్తుందసలు
వెతికిన దొరుకుననుకుంటాం
తట్టిన తెరువబడుననుకుంటాం
కొండలూ కోనలూ అరణ్యాలు పర్వతాలు తిరిగేస్తూనే ఉంటాం
గరళమని అసుంటుంచిన ఆ ఓల్డ్ ఓడ్కాను కసిగా ఒంపేసుకుంటాం
ఏం వెతుకుతున్నామో మర్చిపోయి ఎన్నేళ్లయిందో
ఎవరికైనా ఎలా తెలుస్తుందసలు
సప్తసముద్రాలకు ఆవల మాంత్రికుడి ప్రాణమున్న చిలుక
అందమైన ఎరో అక్షరసత్యమో
అన్వేషణ సత్యమో లక్ష్యం సత్యమో
ఎవరికైనా ఎలా తెలుస్తుందసలు
జి ఎస్ రామ్మోహన్
(ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక(28-7-13)లో ప్రచురితం)

అవును దీర్ఘ కావ్యం వ్రాస్తూ వ్యాకరణాన్ని మరచిపోయిన రచయితలం కదా జి.ఎస్.రామ్మోహన్ గారూ!మోహన రాగమహో మహానందమాయే!
ReplyDelete