మార్క్కూజ్ స్మృతిలో..!
ఆ తర్వాతెప్పుడో హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ హైదరాబాద్ ఫుట్‌పాత్ మీద కొనుక్కొని చదివి భయపడిపోయా, ఆశ్యర్యపడిపోయా,.ఆనందపడిపోయా. అచ్చు ఆయన పాత్రలు తొలిసారి ఐస్ ముక్కలు చేతుల్తో ముట్టుకున్నట్టుగానే. అంతకుముందెప్పుడో మద్రాస్ ఆనంద్(నవయాన్ ఆనంద్) లవ్ ఇన్‌ద టైమ్స్ ఆఫ్ కలరా ఇచ్చి మార్క్కూజ్ అనే మనిషిని నా నెత్తిన పాతేశాడు. ఆ మార్కూజ్ ఇక లేరు. ఇపుడే ఫేస్‌బుక్‌లోకి అడుగుపెడితే మద్రాస్ మోహన్ పోస్టులో ఆయన కొటేషన్ కనిపించింది. ఎందుకో అనుమానం వచ్చి పోస్టుల్లోకి వెడితే వేణుగారు, వనజ పోస్టుల్లో ఆయన లేరన్న విషయం తెలిసింది. నిరంతరం వార్తల మధ్య బతుకుతూ కూడా ఈ వార్త ఫేస్‌బుక్‌లోకి వెడితే తప్ప తెలీని స్థితి ఉండడం..హౌ అబ్సర్డ్. ఎందుకో తెలీదు. ఎక్కడో కలుక్కుమన్న ఫీలింగ్. మనసంతా ఆయన పాత్రలే. ఏం సబంధం ఆయనతో! చూడనైనా చూడలేదు. మహా అయితే రెండు మూడు పుస్తకాలు చదివి ఉంటాను. మహా అయితే రచయితంటే వీడురా బుజ్జీ అనుకుని ఉంటాను. ఇతన్ని రైటర్ అని మనల్ని రైటర్ అని ఒకే పేరుతో పిలిస్తే ఏం బాగుంటుంది. మనం ఏమీ రాయకపోతేనే మేలు అని ఆనందవైరాగ్యం కూడా పొంది ఉంటాను . అయితే మాత్రం ఇంతగా ఎందుకు వెంటాడుతున్నాడతను. అతనికి మనకు ఏమిటి సంబంధం!
No comments:
Post a Comment